ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ.. దొంగ చేసిన ఘనకార్యం..

ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ.. దొంగ చేసిన ఘనకార్యం..
అదీ ఇదీ ఎందుకనుకున్నాడు.. ఆర్టీసీ బస్సునే దొంగిలించాడు ఓ ఘనుడు.

అదీ ఇదీ ఎందుకనుకున్నాడు.. ఆర్టీసీ బస్సునే దొంగిలించాడు ఓ ఘనుడు. ప్రయాణీకులందరూ బస్సులో కూర్చుని రెడీగా ఉన్నారు. బస్సు డ్రైవర్ కిందకు వెళ్లి వచ్చే లోపు ఓ వ్యక్తి లోపలికి వచ్చి ఇంజన్ స్టార్ట్ చేసి రయ్ మని ముందుకు పోనిచ్చాడు. ఇంతలో పెట్రోల్ అయిపోయింది. బస్సు ఆగిపోయింది.

సిద్దిపేటలో ఓ మోసగాడు టీఎస్‌ఆర్‌టీసీ బస్సును దొంగిలించాలనుకున్నాడు. కానీ అతడి పథకం పారలేదు. సిరిసిల్ల జిల్లాలో బస్సులో పెట్రోల్ అయిపోవడంతో బస్సు ముందుకు కదల్లేదు. ప్రయాణికులు స్పందించేలోపే మోసగాడు అక్కడి నుంచి పారిపోయాడు.

ఘటనపై సిద్దిపేట టీఎస్‌ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రయాణీకులు తీసిన ఫోటోలు, వీడియోల ద్వారా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ నిందితుడిని గుర్తించి పట్టుకుంది.

Tags

Next Story