Manchu Manoj : మా నాన్న దేవుడు: మంచు మనోజ్

ప్రేమించిన అమ్మాయి కోసమే తాను పోరాడుతున్నానని మంచు మనోజ్ స్పష్టం చేశారు. మా నాన్న, అన్న కంపెనీల కోసం గొడ్డులా కష్టపడ్డానని తెలిపాడు. మీడియా మిత్రులకు అండగా ఉంటానని తెలిపాడు. మానాన్న దేవుడని మంచు మనోజ్ అన్నారు. మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి తనను కాలుస్తున్నారని మనోజ్ ఆరోపించారు. మరో వైపు సాయంత్రం మనోజ్ పెట్టే ప్రెస్ మీట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇన్నాళ్లు ఆగాను.. ఇక ఆగను: మంచు మనోజ్
తన తండ్రి మోహన్ బాబుతో కొనసాగుతున్న వివాదంపై మంచు మనోజ్ స్పందించారు. ఇలాంటి రోజు వస్తుందనుకోలేదని.. తాను ఇంట్లో డబ్బులు, ఆస్తులు ఆడగడం లేదని మంచు మనోజ్ తెలిపారు. సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తానన్న మనోజ్.. ఇన్నాళ్లు ఆగానని.. ఇక ఆగనని స్పష్టం చేశాడు. తనపై, తన బంధువులపై దాడి చేశారని మంచు మనోజ్ ఆరోపించారు. నా కాళ్ల మీద నేను నిలబడుతున్నా అని వెల్లడించారు.
హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్
మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. ఇప్పటికే మంచు మనోజ్-మోహన్ బాబు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇప్పుడు ఈ వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. పోలీసులు జారీ చేసిన నోటీసుపై మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల విచారణ నోటీసును మోహన్ బాబు సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం 2.30కు హైకోర్టులో విచారణ జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com