MOHANBABU: ఆస్పత్రిలో చేరిన మోహన్‌బాబు

MOHANBABU: ఆస్పత్రిలో చేరిన మోహన్‌బాబు
X
మోహన్‌బాబు, మనోజ్‌ లైసెన్స్‌డ్ గన్‌లు స్వాధీనం... సీరియస్‌గా తీసుకున్న పోలీసులు

సినీనటుడు మోహన్‌బాబు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను తన పెద్ద కొడుకు మంచు విష్ణు గచ్చిబైలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. మోహన్‌బాబుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఇంతకముందు హైదరాబాద్ జల్‌పల్లిలోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మీడియాపై దాడి జరిగిన తర్వాత మోహన్‌బాబు.. హై బీపీతో సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలుస్తోంది.

లైసెన్స్‌ గన్‌లు స్వాధీనం

జల్‌పల్లిలో జరిగిన ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు మోహన్‌బాబు, మనోజ్‌ లైసెన్స్‌ గన్‌లను స్వాధీనం చేసుకొని, సీజ్‌ చేశారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ మోహన్‌బాబుకు రాచకొండ సీపీ నోటీసులు జారీ చేశారు. మోహన్‌బాబు నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు: మనోజ్‌

తన పోరాటం డబ్బు కోసమో, ఆస్తుల కోసమో కాదని, ఆత్మగౌరవం కోసమని కాదని మంచు మనోజ్‌ అన్నారు. తన భార్య పిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తాను పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే.. ఇంటికి వచ్చి అన్ని వివరాలు తెలుసుకున్న ఎస్సై.. రక్షణ కల్పిస్తానని చెప్పి పారిపోయారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే తన మనుషులను బెదిరించి భయపెట్టి బయటకు వెళ్లగొట్టారని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఉప ముఖ్యమంత్రులు, తెలంగాణ డీజీపీకి ట్యాగ్‌ చేశారు. ఇదిలా ఉండగా.. మూడు రోజులుగా మోహన్‌బాబు ఇంటి వద్ద ఇంత రచ్చ జరుగుతూ.. ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నా.. పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story