Maoist Encounter: ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల రియాక్షన్.. పోలీస్ బలగాలు అప్రమత్తం

Maoist Encounter (tv5news.in)
Maoist Encounter: ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌కు నిరసనగా.. రేపు బంద్‌కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. దీంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో భారీ కూంబింగ్ చేపట్టాయి. ములుగు ఏజెన్సీని జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల బంద్ పిలుపు, బలగాల మోహరింపుతో ఏజెన్సీ గ్రామాల్లో హైటెన్షన్ నెలకొంది.
ములుగు జిల్లా పరిధిలోని వెంకటాపురం, వాజేడు, పేరురు, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం అటవీ ప్రాంతంలో డ్రోన్ల సహాయంతో అడవిలో సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టారు. ఎక్కడికక్కడ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు.
అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. గుత్తి కోయ గ్రామాల్లో కార్డన్ సెర్చ్ చేపట్టారు. నిన్న తెలంగాణ సరిహాద్దు ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోలు మృతి చెందారు. మావోల నుంచి ఏకే 47 , ఎస్ ఎల్ ఆర్,రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన డెడ్ బాడీలను పోస్టుమార్టం నిమిత్తం బీజాపూర్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందినవారిలో రీజనల్ సెంటర్ సీఆర్‌సి కంపెనీకి చెందిన కామ్రేడ్ నరోటి దామాల్, పునెం బద్రు, సోడి రామాల్ ఉన్నారు. అయితే ఈ ఎన్‌కౌంటర్ బూటకమని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ప్రకటన విడుదలైంది. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా రేపు బంద్‌కు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com