MAOIST: ఆయుధాలు వదిలేస్తాం.. సమయమివ్వండి

ఆయుధాలను వీడటం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. పొలిట్‌బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని తెలుపుతూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ప్రతినిధి అనంత్ ఓ లేఖ విడుదల చేశారు. CCM సతీష్ దాదా తర్వాత, మరొక CCM కామ్రేడ్ చంద్రన్న ఇటీవల ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. మేం MMC స్పెషల్ జోనల్ కమిటీ కూడా హాథియార్ను విడిచిపెట్టి, ప్రభుత్వ పునరావాసం ప్రణాళికను అంగీకరించాలన్న నిర్ణయానికి వచ్చామని.. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు మాకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ రాసింది. సీసీఎం సతీష్ దాదాతో పాటు సీసీఎం మెంబర్ కామ్రేడ్ చంద్రన్న ఆయన నిర్ణయాన్ని బలపరిచారని పేర్కొన్నారు. అదేవిధంగా ఎంఎంసీ జోనల్ కమిటీ కూడా ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలోకి రావాలనుకుంటున్నామని పేర్కొన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నామన్నారు.
రాబోయే పీఎల్జీఏ (PLGA) వార్షికోత్సవాల నేపథ్యంలో ఎలాంటి ఆపరేషన్లు నిర్వహించకూడదని మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎంఎంసీ జోన్ కమిటీ రిక్వెస్ట్ చేసింది. అదేవిధంగా ఎంఎంసీ జోన్ పరిధిలోని దళ సభ్యులంతా కార్యకలాపాలను నిలిపివేయబోతున్నట్లుగా తెలిపారు. ఈ లేఖలోని సందేశాన్ని వీలైనంత త్వరగా రేడియోలో ఆయా ప్రభుత్వాలు ప్రసారం చేయాలని.. అప్పుడు తమ సహచరులకు సమాచారం తెలుస్తుందని అన్నారు. లొంగిపోయే ముందు మూడు రాష్ట్రాల్లోని కొంతమంది ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులతో సమావేశమయ్యే అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

