MAOISTS: మావోయిస్టు ఉద్యమ చరిత్రలో భారీ లొంగుబాటు

అగ్రనేతల వరుస సరెండర్లు మావోయిస్టు పార్టీని ఊపిరి పీల్చుకోకుండా చేస్తున్నాయి. ఓ వైపు ఉధృతంగా కొనసాగుతోన్న ఆపరేషన్ కగార్.. మరోవైపు కేంద్ర హోంమత్రి అమిత్ షా హెచ్చరికలు మావోయిస్టుల కేడర్లలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఆయుధాలను స్వచ్ఛందంగా వదిలేసి ప్రజాక్షేత్రం పోరాటం చేసేందుకు మావోయిస్టు కేడర్లు ఆసక్తి చూపుతున్నాయి. ఈ దరిమిల దేశంలోనే మావోయిస్టు ఉద్యమ చరిత్రలో మరో అతిపెద్ద సరెండర్ జరిగింది. పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్, మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట జగ్దల్పూర్లో లొంగిపోయారు. అనంతరం వారికి సీఎం భారత రాజ్యంగ ప్రతులను అందజేశారు. లొంగిపోయిన వారితో పాటు మరో 208 మంది పార్టీ సభ్యులు కూడా సరెండర్ అయ్యారు. వారిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు భారీగా తుపాకులు, మారణాయుధాలను పోలీసులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 153 తుపాకులు, 11 గ్రనేడ్ లాంచర్లు, 41 సింగిల్ షాట్ గన్స్, లైట్ మెషీన్ గన్స్ ఉన్నాయి.
సీఎం ఎదుట లొంగుబాటు
పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్, మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట జగ్దల్పూర్లో లొంగిపోయారు. అనంతరం వారికి సీఎం భారత రాజ్యంగ ప్రతులను అందజేశారు. లొంగిపోయిన వారితో పాటు మరో 208 మంది పార్టీ సభ్యులు కూడా సరెండర్ అయ్యారు. 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. హింసను వీడి జనజీవన స్రవంతిలో చేరాలని, వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఉద్యమంలోని అంతర్గత విభేదాలు, స్థానిక ప్రజల నుంచి మద్దతు కరువవడం వంటి కారణాలతో మావోయిస్టులు లొంగుబాటుకు మొగ్గుచూపుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. లొంగిపోయిన వారికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వారు తిరిగి సమాజంలో గౌరవంగా బతికేందుకు అవసరమైన తోడ్పాటును ప్రభుత్వం అందిస్తోంది.
ఆశన్న చివరి ప్రసంగం
లొంగుబాటు నేపథ్యంలో ఆశన్న సహచరులను ఉద్దేశించి చివరి ప్రసంగం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలను వదిలిపెడుతున్నాం అని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఉండలేమన్నారు. ‘ఎవరికి వారే తమ రక్షణ కోసం ఇప్పుడు పోరాటం చేసుకోవాలి. ఆయుధాలను వదిలిపెడుతున్నాం తప్ప తమ పంథాలు మర్చిపోము. జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజల కోసం పోరాటం చేస్తాం. సహచరులందరూ ఎక్కడ వారు అక్కడ లొంగిపోవడం మంచిది. ఎవరైనా లొంగిపోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఇది లొంగుబాటు కాదు.. జనజీవన స్రవంతిలో కలుస్తున్నామని ప్రభుత్వం ఒప్పుకుంది. ప్రభుత్వం ఇచ్చిన మాట వరకే జనజీవ స్రవంతిలో కలుస్తున్నాం. ఉద్యమంలో ఎంతోమంది అమరులైనారు వారందరికీ జోహార్లు’ అని ఆశన్న సహచరులను ఉద్దేశించి మాట్లాడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com