ఈ రోజు నుంచి మాస్క్ ధరించాల్సిందే.. ఓమిక్రాన్‌పై తెలంగాణ ప్రభుత్వం నిబంధన.. !

ఈ రోజు నుంచి మాస్క్ ధరించాల్సిందే.. ఓమిక్రాన్‌పై తెలంగాణ ప్రభుత్వం నిబంధన.. !
X
Telangana Health Deportment : ప్రపంచాన్ని వణికిస్తున్న ఓమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉన్నామని తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు.

Telangana Health Deportment : ప్రపంచాన్ని వణికిస్తున్న ఓమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉన్నామని తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వారిలో ఒకరు పాజిటివ్‌గా తేలారని.. పరీక్షల రిపోర్టును జినోమ్‌కు పంపడం జరిగిందని తెలిపారు. యూకె నుంచి మహిళ రంగారెడ్డి జిల్లాకు చెందినవారిగా గుర్తించినట్లు చెప్పారు. తొలి డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 25 లక్షల మంది రెండో డోస్‌ తీసుకోలేదని, అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు. మాస్క్‌ ధరించడంతో పాటు కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.

Tags

Next Story