Jagtial Crime: భార్య, భర్తలను, బాత్రూంలో బందించి దొంగతనం

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. దంపతులను తుపాకులతో బెదిరించి, వారిపై దాడి చేసి బంగారు ఆభరణాలు దొంగలించి పరారయ్యారు దుండగులు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బాధితులు ఈశ్వరయ్య, భార్య ఇద్దరు మండల కేంద్రంలో కిరాణం దుకాణం నిర్వహిస్తారు. నిన్న ఉదయం 5 గంటల సమయంలో బాత్రూమ్‌కు వెళ్తుండగా నలుగురు గురు దొంగలు మంకీ క్యాప్ వేసుకొని వెనక నుండి వచ్చి కాళ్లు, చేతులు కట్టేసి, అతని భార్యను కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి బాత్రూమ్‌లో బంధించారు. ఈశ్వరయ్య పై తుపాకులతో రక్తం వచ్చేలా దాడి చేశారు. బాధితుడి నుండి బ్రాస్‌లైట్, రెండు ఉంగరాలు, చైన్, భార్య మేడాలో నుండి మంగళసూత్రం, కమ్మలు, మొత్తంగా 10 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి, 10 వేల నగదు దొంగతనం చేసి పరారైనట్లు తెలిపారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీ ఫొటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి చేరకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో విచారణ చేపట్టారు. బొమ్మ తుపాకులా, నిజమైనవా? అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com