MAYOR: గులాబీ కోటకు కాంగ్రెస్ ‘ఎక్స్ అఫీషియో’ షాక్

MAYOR: గులాబీ కోటకు కాంగ్రెస్ ‘ఎక్స్ అఫీషియో’ షాక్
X
కీలకంగా ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు.. హంగ్ ఏర్పడిన చోట అత్యంత కీలకం

తె­లం­గా­ణ­లో హం­గ్​ ము­న్సి­పా­లి­టీ­లు, కా­ర్పొ­రే­ష­న్ల­లో తీ­వ్ర ఉత్కంఠ నె­ల­కొ­న్న­ది. ఏ పా­ర్టీ­కి పూ­ర్తి మె­జా­రి­టీ రాని చో­ట్ల ఇం­డిం­పెం­డెం­ట్లే కిం­గ్‌­‌­‌­‌­‌­‌­‌‌ మే­క­ర్లు­గా మా­ర­డం­తో బే­ర­సా­రా­లు జో­రం­దు­కు­న్నా­యి. అన్ని­చో­ట్లా క్యాం­పు రా­జ­కీ­యా­లు నడు­స్తు­న్నా­యి. సో­మ­వా­రం పరో­క్ష పద్ధ­తి­లో మే­య­ర్, చై­ర్‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­ప­ర్స­న్​ ఎన్ని­క­లు జర­గ­ను­న్నా­యి. గె­లి­చిన కౌ­న్సి­ల­ర్లు, కా­ర్పొ­రే­ట­ర్ల­తో­పా­టు మీ­టిం­గ్‌­‌­‌­‌­‌­‌­‌­‌­కు హా­జ­ర­య్యే ఎక్స్​ అఫీ­షి­యో సభ్యు­ల­తో కలి­పి 50 శా­తా­ని­కి పైగా ఓట్లు వచ్చిన పా­ర్టీ అభ్య­ర్థు­లే మే­య­ర్, చై­ర్‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­ప­ర్స­న్​అ­వు­తా­రు. డి­ప్యూ­టీ మే­య­ర్​, డి­ప్యూ­టీ చై­ర్‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­‌­ప­ర్స­న్​ ఎన్ని­క­లు కూడా ఇదే వి­ధం­గా ని­ర్వ­హి­స్తా­రు. దీం­తో హం­గ్​ ము­న్సి­పా­లి­టీ­ల్లో ఇం­డిం­పెం­డెం­ట్లు కీ­ల­కం­గా మా­రా­రు. వీ­రి­ని తమ­వై­పు తి­ప్పు­కో­వ­డా­ని­కి అన్ని రా­జ­కీయ పా­ర్టీ­లు బే­ర­సా­రా­లు మొ­ద­లు­పె­ట్టా­యి. క్యాం­పు రా­జ­కీ­యా­లు జో­రం­దు­కు­న్నా­యి. ఎక్స్​అ­ఫీ­షి­యో సభ్యుల ఓటు హక్కు­పై శని­వా­రం రా­ష్ట్ర ఎన్ని­కల సంఘం (ఎస్‌­‌­‌­‌­‌­‌­‌­‌­ఈ­సీ) క్లా­రి­టీ ఇచ్చిం­ది. ఎక్స్​అ­ఫీ­షి­యో సభ్యు­లు­గా నమో­దు­చే­సు­కు­నే ఎమ్మె­ల్యే­లు, ఎం­పీల ని­యో­జ­క­వ­ర్గా­ల్లో ఆయా కా­ర్పొ­రే­ష­న్లు, ము­న్సి­పా­లి­టీ­లు భా­గ­మై ఉం­డా­లి. ఇక రా­జ్య­సభ సభ్యు­లు, ఎమ్మె­ల్సీ­ల­కు ఆయా కా­ర్పొ­రే­ష­న్లు, ము­న్సి­పా­లి­టీల పరి­ధి­లో ఓటు కలి­గి ఉం­డా­లి. హై­కో­ర్టు తీ­ర్పు­కు తగ్గ­ట్టు­గా ఎస్ఈ­సీ కొ­త్త మా­ర్గ­ద­ర్శ­కా­లు జారీ చే­సిం­ది. దీం­తో చాలా చో­ట్ల సమీ­క­ర­ణా­లు మా­ర­ను­న్నా­యి.

‘చే­తు­లె­త్తే పద్ధ­తి­లో ’ మే­య­ర్, చై­ర్‌­‌­‌­‌­‌­‌­‌­‌­ప­ర్స్‌­‌­‌‌ ఎన్ని­క­లు జరు­గు­తా­యి. బరి­లో ఉన్న ఇద్ద­రి­కి సమాన ఓట్లు వస్తే లా­ట­రీ ద్వా­రా వి­జే­త­ను ప్ర­క­టి­స్తా­రు. కొ­త్త­గా ఎన్ని­కైన సభ్యు­ల­తో­పా­టు ఆయా ము­న్సి­పా­లి­టీ­లు, కా­ర్పొ­రే­ష­న్ల­లో ఎక్స్​అ­ఫీ­షి­యో సభ్యు­లు­గా నమో­దు చే­సు­కు­న్న ఎం­పీ­లు, ఎమ్మె­ల్యే­లు, ఎమ్మె­ల్సీ­లు, రా­జ్య­సభ సభ్యు­ల­కు ఓటు హక్కు ఉం­టుం­ది. ఈ మే­ర­కు వీరి పే­ర్ల­ను ఆయా జి­ల్లాల కలె­క్ట­ర్లు శని­వా­రం ఫై­న­ల్​ చేసి ఆయా ము­న్సి­పా­లి­టీ­లు, కా­ర్పొ­రే­ష­న్ల ఆఫీ­స­ర్ల­కు పం­పిం­చా­రు.

రా­జ్య­సభ సభ్యు­లు, ఎమ్మె­ల్సీ­లు ఆయా ప్రాం­తా­ల్లో ఓటరు నమో­దు చే­సు­కు­ని ఉం­డా­లి. హై­కో­ర్టు తీ­ర్పు ప్ర­కా­రం కొ­త్త మా­ర్గ­ద­ర్శ­కా­లు జారీ చే­య­డం­తో కొ­న్ని చో­ట్ల సమీ­క­ర­ణా­లు మారే అవ­కా­శం ఉంది. జి­ల్లా కలె­క్ట­ర్లు ఎక్స్‌­అ­ఫీ­షి­యో సభ్యుల జా­బి­తా­ల­ను ఖరా­రు చేసి సం­బం­ధిత అధి­కా­రు­ల­కు పం­పిం­చా­రు. ఎన్ని­కల ప్ర­క్రి­య­ను పా­ర­ద­ర్శ­కం­గా ని­ర్వ­హిం­చేం­దు­కు వీ­డి­యో చి­త్రీ­క­రణ తప్ప­ని­స­రి చే­శా­రు. అవ­స­ర­మై­తే ప్ర­త్య­క్ష ప్ర­సా­రం కూడా చే­య­వ­చ్చ­ని సూ­చిం­చా­రు. పరో­క్ష ఎన్ని­క­లు ప్ర­శాం­తం­గా జరి­గేం­దు­కు రా­ష్ట్ర ఎన్ని­కల సంఘం కట్టు­ది­ట్ట­మైన భద్ర­తా ఏర్పా­ట్లు చే­యా­ల­ని జి­ల్లా కలె­క్ట­ర్లు, పో­లీ­సు అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చిం­ది. స్వే­చ్ఛ­గా ఓటు వే­య­గల వా­తా­వ­ర­ణం కల్పిం­చా­ల­ని స్ప­ష్టం చే­సిం­ది.

Tags

Next Story