MEDARAM: మురికి కూపంలా మారిన "మేడారం"

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ముగిసింది. లక్షలాది మంది భక్తుల రాకతో నెల రోజులుగా కిక్కిరిసిపోయిన మేడారం పరిసరాలు.. జాతర ముగిసిన అనంతరం భారీగా పేరుకుపోయిన వ్యర్థాలతో నిండిపోయాయి. భక్తులు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకున్నప్పటికీ.. వారు వదిలి వెళ్లిన టన్నుల కొద్దీ చెత్తను శుభ్రం చేయడం ఇప్పుడు అధికారులకు, పారిశుధ్య సిబ్బందికి పెద్ద సవాల్‌గా మారింది. జంతు, కోళ్ల వ్యర్థాలు కుళ్లిపోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య సిబ్బందితో శుభ్రపరిచే పనులను వేగవంతం చేస్తున్నారు. ఈ శుభ్రతా పనుల్లో ఉన్న కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ క్లీనింగ్ అని చెప్పి తీసుకొచ్చారని, కానీ జంతు అవశేషాలు, కోళ్ల వ్యర్థాలతో కూడిన అత్యంత దుర్భర పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తోందని వారు వేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి కృపతోనే ఈ పనిని భరిస్తున్నామని చెబుతూ భావోద్వేగానికి లోనవుతున్నారు. వ్యర్థాల్లో దాదాపు 48 శాతం ప్లాస్టిక్, గాజు సీసాల వంటివి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మేడారంతో పాటు కన్నెపల్లి, నార్లాపూర్, కొంగల గట్టు వంటి ప్రాంతాల్లో దాదాపు 3 వేల టన్నుల చెత్త పేరుకుపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
కార్మికుల ఆవేదన
పనుల్లో పాల్గొంటున్న కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "రోడ్లు, ప్లాస్టిక్ క్లీనింగ్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ జంతువుల తోళ్లు, తలకాయలు, కోళ్ల వ్యర్థాలు గుట్టలుగా పడి ఉన్నాయి. వాటిని చూస్తుంటేనే వాంతులు వస్తున్నాయి. ఇంత గలీజు పని మేమెప్పుడూ చేయలేదు" అని కొందరు వాపోయారు. అమ్మవార్ల దయతోనే ఈ పని చేస్తున్నాం అని కన్నీటిపర్యంతమయ్యారు. జాతర వ్యర్థాల్లో దాదాపు 48 శాతం ప్లాస్టిక్, గాజు సీసాల వంటివి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సుమారు 100 టన్నుల ఖాళీ బాటిళ్లలో చాలా వరకు పగిలిపోయి ప్రమాదకరంగా మారాయి. మిగిలిన 52 శాతం బియ్యం, బెల్లం వంటివి భూమిలో కలిసిపోయేవిగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యర్థాలను వేరు చేసి, మేడారం ప్రాంగణాన్ని శుభ్రపరిచే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వ్యర్థాల వర్గీకరణ, ప్లాస్టిక్ ముప్పు జాతరలో పోగైన వ్యర్థాల్లో సుమారు 48 శాతం వరకు ప్లాస్టిక్, గాజు వంటి భూమిలో కలిసిపోని వస్తువులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీటిలో సుమారు 100 టన్నులకు పైగా కేవలం ఖాళీ బాటిళ్ల వ్యర్థాలే ఉన్నట్లు గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
