MEDARAM: మేడారానికి మహర్దశ..ఆలయ ఆవరణ విస్తరణ

MEDARAM: మేడారానికి మహర్దశ..ఆలయ ఆవరణ విస్తరణ
X
అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ... జాతర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి.. మేడారం పూజారుల సలహాలు తీసుకోవాలన్న సీఎం

ఆసి­యా­లో­నే అతి­పె­ద్ద గి­రి­జన పం­డు­గ­గా ప్ర­సి­ద్ధి చెం­దిన సమ్మ­క్క సా­ర­ల­మ్మ మే­డా­రం జా­త­ర­ను అత్యంత ప్ర­తి­ష్టా­త్మ­కం­గా ని­ర్వ­హిం­చా­ల­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. మహా జాతర కోసం రూ­పొం­దిం­చే అభి­వృ­ద్ధి ప్ర­ణా­ళి­క­లు పూ­ర్తి­గా గి­రి­జన సం­ప్ర­దా­యా­లు, ఆచా­రా­ల­ను గౌ­ర­విం­చే వి­ధం­గా ఉం­డా­ల­ని సూ­చిం­చా­రు. మే­డా­రం సమ్మ­క్క-సా­ర­ల­మ్మ జాతర అభి­వృ­ద్ధి పను­ల్లో గి­రి­జన సం­స్కృ­తి, సం­ప్ర­దా­యా­ల­కు అత్య­ధిక ప్రా­ధా­న్యత ఇవ్వా­ల­ని ము­ఖ్య­మం­త్రి ఎ. రే­వం­త్ రె­డ్డి అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. జాతర అభి­వృ­ద్ధి కోసం రూ­పొం­దిం­చే మా­స్ట­ర్ ప్లా­న్‌­లో గి­రి­జన సం­ప్ర­దా­యా­ల­కు ఎలాం­టి లోటు రా­కుం­డా చూ­డా­ల­ని ఆయన స్ప­ష్టం చే­శా­రు. అభి­వృ­ద్ధి ప్ర­ణా­ళి­క­ల­ను ఖరా­రు చేసే ముం­దు క్షే­త్ర­స్థా­యి­లో సమ్మ­క్క-సా­ర­ల­మ్మ పూ­జా­రు­ల­తో చర్చిం­చి, వారి సల­హా­లు, సూ­చ­న­లు తప్ప­ని­స­రి­గా తీ­సు­కో­వా­ల­ని సీఎం తె­లి­పా­రు. ఇం­దు­లో భా­గం­గా, ఈ నెల 23న తాను స్వ­యం­గా మే­డా­రం సం­ద­ర్శి­స్తా­న­ని, మం­త్రు­లు, అధి­కా­రు­లు, గి­రి­జన ప్ర­జా­ప్ర­తి­ని­ధు­ల­తో కలి­సి డి­జై­న్ల­ను ఖరా­రు చే­స్తా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. అభి­వృ­ద్ధి పను­ల­ను పర్య­వే­క్షిం­చేం­దు­కు వెం­ట­నే ఒక టె­క్ని­క­ల్ కమి­టీ­ని ఏర్పా­టు చే­యా­ల­ని ఆదే­శిం­చా­రు. ఈ ప్ర­ణా­ళి­క­పై తుది ని­ర్ణ­యం తీ­సు­కు­నే ముం­దు, సమ్మ­క్క సా­ర­ల­మ్మ పూ­జా­రు­ల­తో సం­ప్ర­దిం­చి, వారి సల­హా­లు, సూ­చ­న­ల­ను పరి­గ­ణ­న­లో­కి తీ­సు­కో­వా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. దీ­ని­లో భా­గం­గా.. ము­ఖ్య­మం­త్రి స్వ­యం­గా ఈ నెల 23న మే­డా­రం సం­ద­ర్శిం­చి, క్షే­త్ర­స్థా­యి­లో పరి­స్థి­తి­ని సమీ­క్షిం­చ­ను­న్నా­రు.

టెక్నికల్ కమిటీల ఏర్పాటు

అభి­వృ­ద్ధి పను­ల­కు సం­బం­ధిం­చి సాం­కే­తిక అం­శా­ల­ను పర్య­వే­క్షిం­చ­డా­ని­కి ఒక ప్ర­త్యేక టె­క్ని­క­ల్ కమి­టీ­ని ఏర్పా­టు చే­యా­ల­ని అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. ఆలయ పరి­సర ప్రాం­తా­ల్లో స్థా­నిక గి­రి­జన సం­ప్ర­దా­యా­ని­కి అను­గు­ణం­గా ఉండే వృ­క్షా­ల­ను పెం­చ­డా­ని­కి చర్య­లు తీ­సు­కో­వా­ల­న్నా­రు. జా­త­ర­కు వచ్చే భక్తు­ల­ను స్వా­గ­తిం­చే తో­ర­ణా­లు సైతం గి­రి­జన సం­స్కృ­తి, సం­ప్ర­దా­యా­ల­ను ప్ర­తి­బిం­బిం­చే­లా ఉం­డా­ల­ని సీఎం రే­వం­త్ సూ­చిం­చా­రు. మే­డా­రం జాతర కే­వ­లం ఒక పం­డుగ మా­త్ర­మే కా­ద­ని, గి­రి­జ­నుల ఆత్మ­గౌ­ర­వా­ని­కి ప్ర­తీక అని రే­వం­త్ వె­ల్ల­డిం­చా­రు. మే­డా­రం జా­త­ర­ను మరింత ఘనం­గా, సం­ప్ర­దా­య­బ­ద్ధం­గా ని­ర్వ­హిం­చేం­దు­కు ఏర్పా­ట్లు చే­యా­ల­ని సీఎం రే­వం­త్ రె­డ్డి అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. అభి­వృ­ద్ధి పనుల రూ­ప­క­ల్ప­న­లో గి­రి­జన సం­ప్ర­దా­యా­ల­కు ఏ మా­త్రం భంగం కల­గ­కుం­డా చూ­డా­ల­ని ము­ఖ్య­మం­త్రి స్ప­ష్టం చే­శా­రు. పూ­జా­రు­లు, గి­రి­జన నా­య­కు­లు, ప్ర­జా­ప్ర­తి­ని­ధు­లు, తుది ప్ర­ణా­ళి­క­కు ఆమో­దం తె­ల­ప­ను­న్నా­రు.

Tags

Next Story