Medical Student : ప్రీతీ ఆరోగ్యం అత్యంత విషమం

కాకతీయ మెడికల్ కాలేజీ.. పీజీ విద్యార్థిని ప్రీతీ ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. హైదరాబాద్ నిమ్స్‌లో ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్‌తో పాటు, బ్రెయిన్‌లో సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇప్పటికే మూడుసార్లు సీపీఆర్ చేసినట్లు తెలుస్తోంది. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు తాళళేక ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ప్రాణాలు తీసుకోవాలనుకుంది.
ప్రీతి కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతోంది. సీనియర్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్యహత్యాయత్నం చేసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అటు ప్రీతిని వేధించిన సైఫ్‌పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్ధి సంఘాలు కేఎంసీలో ఆందోళన చేపట్టాయి. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. విద్యార్థి సంఘాల ఆందోళన తర్వాత పోలీసులు సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. సైఫ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com