Medico Preethi Case: అవును ర్యాగింగ్‌ చేశాను: సైఫ్‌

Medico Preethi Case: అవును ర్యాగింగ్‌ చేశాను: సైఫ్‌
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్‌ ప్రీతి మృతి కేసులో కీలక మలుపు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్‌ ప్రీతి మృతి కేసు కీలక మలుపులు తిరుగుతోంది. సీనియర్‌ పీజీ విద్యార్థి సైఫ్‌.. ప్రీతిని ర్యాగింగ్‌ చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకొన్నట్లు తెలిసింది. ప్రీతి ఆత్మహత్యకు సైఫ్‌ ర్యాగింగ్‌ కారణమని పోలీసులు తెలిపినా.. అతడు ఖండిస్తూ వచ్చాడు. తాను ఓ సీనియర్‌గా.. వృత్తి రీత్యా ప్రీతి పొరపాట్లను తప్పని చెప్పానే కానీ.. అది ర్యాగింగ్‌ కాదని వాదించాడు. ఐతే.. పోలీసులు వాట్సప్‌ చాటింగ్‌లు బయటకు తీసి సైఫ్‌ ఉద్దేశపూర్వకంగానే ప్రీతిని ర్యాగింగ్‌ చేసినట్టు నిర్ధారించారు. అతడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

పోలీసులు 4 రోజులపాటు జరిపిన విచారణలో ఆధారాలు చూపించి సైఫ్‌ను ప్రశ్నించగా, తాను ర్యాగింగ్‌కు పాల్పడ్డది నిజమేనని, చాటింగ్‌ కూడా చేశానని సైఫ్‌ అంగీకరించినట్లు సమాచారం. కస్టడీ ముగిశాక మార్చి 6న కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టిన సమయంలో పోలీసులు కోర్టుకు సమర్పించిన కన్ఫెషన్‌ రిపోర్టులో ఈ విషయాలను పేర్కొన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఫిబ్రవరి 22న ప్రీతి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో అపస్మారక స్థితిలోకి వెళ్లింది.. తర్వాత నిమ్స్‌కు తరలించగా.. ఫిబ్రవరి 26న తుదిశ్వాస విడిచింది.

Tags

Read MoreRead Less
Next Story