Medico Preethi Case: కళాశాల నుంచి సైఫ్‌ సస్పెండ్‌

Medico Preethi Case: కళాశాల నుంచి సైఫ్‌ సస్పెండ్‌
వరంగల్‌ మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్‌ను.. కాకతీయ మెడికల్‌ కళాశాల నుంచి సస్పెండ్ చేశారు

వరంగల్‌ మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్‌ను.. కాకతీయ మెడికల్‌ కళాశాల నుంచి సస్పెండ్ చేశారు. యాంటీ ర్యాంగింగ్ కమిటీ సిఫారసుల మేరకు సైఫ్‌ను సంవత్సరం పాటు సస్పెండ్ చేసినట్లు ప్రిన్సిపల్ ప్రకటించారు. ఆనస్థీషియాలజీలో పీజీ సెకండియర్ చదువుతున్న సైఫ్‌.. మెడికో ప్రీతిని వేధించినట్లు పోలీస్ విచారణలో తెలింది. గత మార్చిలో సైఫ్‌ను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ.. కేఎంసీ ప్రిన్సిపల్‌ మోహన్‌ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. సంవత్సర కాలంలో సైఫ్‌కు అకడమిక్స్‌ , థియరీ ప్రాక్టికల్ క్లాసులు, లైబ్రరీ, హాస్టల్‌కు అనుమతి లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Tags

Next Story