మాయలేడిని ఎరగా వేసి నగదు, నగలు అపహరణ

మాయలేడిని ఎరగా వేసి నగదు, నగలు అపహరణ
యువతి..యువకులతో పరిచయం పెంచుకొని రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లేది. ఆ సమయంలో ఇద్దరు యువకులు బెదిరింపులకు దిగి నగదు దోచుకునేవారు.

మాయలేడిని ఎరగా వేసి నగదు, నగలు అపహరిస్తున్న ముఠాను జగిత్యాల జిల్లా పోలీసులు అరస్ట్‌ చేశారు. ఇద్దరు మహిళలతో పాటు ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి 145 గ్రాముల బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సింధూశర్మ వెల్లడించారు. అమాయకులకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి నగదు, నగలు దోచుకుంటూ కొత్తరకం మోసానికి పాల్పడ్డట్లు గుర్తించారు.

తులసి అనే యువతి.. యువకులతో పరిచయం పెంచుకొని రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లేది. ఆ సమయంలో రాజ్‌కుమార్‌, దినేష్‌ అనే యువకులు బెదిరింపులకు దిగి నగలు, నగదు దోచుకునేవారు. పరువు పోతుందన్న భయంతో చాలామంది ఫిర్యాదులు చేయలేదని ఎస్పీ తెలిపారు. అయినా పోలీసులు చాకచక్యంగా వారి గుట్టురట్టు చేశారన్నారు.


Tags

Read MoreRead Less
Next Story