MESSI: నేడు హైదరాబాద్‌కు ది గోట్ మెస్సీ

ఫుట్‌బాల్ దిగ్గజం.. అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ.. ది గోట్ ఇండియా టూర్-2025లో భాగంగా హైదరాబాద్ వస్తున్నారు. నేడు హైదరాబాద్ వస్తున్న మెస్సీ.. ఉప్పల్ స్టేడియంలో ఆ రోజు నిర్వహిస్తున్న ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తలపడనున్నారు. మెస్సీ హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన వివరాలను ఆ టూర్ ప్రమోటర్ పార్వతిరెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు. మెస్సీ హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో 13వ తేదీన సింగరేణి ఆర్ఆర్-9, అపర్ణ జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఉంటుందన్నారు. ఇందులో సింగరేణి జట్టు తరఫున రేవంత్ రెడ్డి, అపర్ణ జట్టు తరఫున మెస్సీ ఆడుతున్నారని వెల్లడించారు.
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. షెడ్యూల్ లో భాగంగా నేడు మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య కోల్‌కతా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. శంషాబాద్ చేరుకున్న వెంటనే మెస్సీ నేరుగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. అక్కడ గంటపాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మెస్సీతో ఫోటో దిగేందుకు 10 లక్షల రూపాయలు చెల్లించి ముందుగానే స్లాట్లు బుక్ చేసుకున్న 100 మంది అదృష్టవంతులతో స్టార్ ప్లేయర్ ముఖాముఖీగా మాట్లాడి, ఫోటోలు దిగనున్నాడు.
సాయంత్రం 6 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ చిన్నారుల ఫుట్‌బాల్ జట్టుతో 15 నిమిషాలపాటు సంభాషించి, కొన్ని ఫుట్‌బాల్ మెళకువలు తెలపనున్నాడు. ఆపై సాయంత్రం 7 గంటలకు ప్రధాన ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇందులో సంగీత కార్యక్రమం సహా పలు ఆకర్షణలు ఉంటాయి. 7.30కి ప్రత్యేక మ్యాచ్ జరుగనుంది. సింగరేణి RR జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా.. అపర్ణ మెస్సీ టీమ్ తరఫున మెస్సీ ఆడనున్నారు. మెస్సీతో పాటు అతని స్నేహితులైన రోడ్రిగో, లూయిస్ సురేజ్ కూడా ఈ మ్యాచ్‌లో పాల్గొనబోతున్నారు. అయితే మ్యాచ్ చివరి ఐదు నిమిషాల్లో మాత్రమే మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్లోకి ప్రవేశించి ఆడనున్నారు. మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు GOAT ట్రోఫీని మెస్సీ, రేవంత్ రెడ్డి కలిసి ప్రధానం చేయనున్నారు. మరుసటి రోజు ఉదయం ముంబైకి పయనమవుతారు.
మ్యాచ్ కోసం ముస్తాబైన ఉప్పల్ స్టేడియం
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఆడబోయే ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. ఇప్పటికే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉప్పల్‌లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ భద్రత నడుమ ఈ మ్యాచ్ జరగనుంది. మెస్సీకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ, 3,500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఈవెంట్ కోసం స్టేడియం అధికారులు మొత్తం రూ.50 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్టేడియం మౌలిక వసతుల పునరుద్ధరణలో భాగంగా, కుర్చీలు, లైటింగ్, షెడ్లు, బాత్రూములు మొదలైన వాటి మరమ్మతులు చేసినట్లు తెలుస్తోంది. ఈ RGI స్టేడియంలో 59 కార్పొరేట్ బాక్సుల సామర్థ్యంతో 38,000 మంది ప్రేక్షకులను ఆతిథ్యం ఇవ్వగలదు.. ఈ స్టేడియం ఇప్పటికే అనేక క్రికెట్ లీగ్‌లు, మ్యాచ్‌లు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. నేడు మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య కోల్‌కతా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడినుంచి గ్రీన్ ఛానల్ ద్వారా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. అక్కడ అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

