Telangana Weather: తెలంగాణలో తగ్గని చలి.. ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్..

Telangana Weather: తెలంగాణలో తగ్గని చలి.. ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్..
Telangana Weather: తెలంగాణలోని అన్ని జిల్లాలతో పోలిస్తే ఆదిలాబాద్‌లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది.

Telangana Weather: తెలంగాణలో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ అంచనా వేయలేరు. కానీ ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా చలి ప్రజలను వణికిస్తోంది. మామూలుగా ప్రతీ సంవత్సరం సంక్రాంతి దాటిన తర్వాత ఉష్ణోగ్రతలు కంట్రోల్‌లోకి వస్తాయి. చలి తగ్గిపోతుంది. కానీ ఈసారి అలా జరగట్లేదు. సంక్రాంతి దాటి 15 రోజులు అవుతున్న చలి మాత్రం ఇంకా ప్రజలను భయపెడుతూనే ఉంది.

మామూలుగా చలికాలం బయటికి రావడానికి ఎవ్వరూ పెద్దగా ఇష్టపడరు. కానీ కొన్నాళ్లకు చలికాలం పోతుంది. ఎండలు మండిపోవడం మొదలవుతుంది. కానీ ఈ ఏడాది చలి పోవడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకుంటోంది. ఇంకా చలి తగ్గకపోవడం వల్ల ఇంట్లోనే ఉండి దుప్పటి కపుకుని సేదతీరుతున్నారు చాలామంది. చలి గురించి వాతావరణ శాఖ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

తెలంగాణలోని అన్ని జిల్లాలతో పోలిస్తే ఆదిలాబాద్‌లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ జిల్లాలో 5 డిగ్రీల నుంచి 8 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ 14 జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ నడుస్తోంది. హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. మరో రెండు రోజులు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story