Metla Bhavi: పురాతన మెట్లబావికి మెరుగులు.. సందర్శకుల కోసం ఈ రోజు నుంచి..

Hyderabad: హైదరాబాద్ బన్సీలాల్‌పేట్‌లో మెట్లబావి ఓపెనింగ్‌కు రెడీ అయింది. ఇవాళ సాయంత్రం మంత్రలు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్.....ఈ మెట్లబావిని ప్రారంభించనున్నారు. నాగన్నకుంటగా పిలిచే ఈ మెట్లబావిని చూసేందుకు ఇకపై సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు. 3 శతాబ్ధాల క్రితం ఈ మెట్లబావిని నిర్మించారు. 30.5 మీటర్ల పొడవు, 19.2 అడుగుల వెడల్పు, 53 అడుగుల లోతుతో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించారు.
ఐతే దశాబ్ధాలుగా నిరాదరణకు గురై.... రూపు రేఖలు కోల్పోయిన ఈ మెట్లబావిని సహిత స్వచ్ఛంద సంస్థ సహకారంతో తెలంగాణ సర్కార్ పునరుద్ధరించింది. దాదాపు 16 నెలల పాటు శ్రమించి ఈ బావి రూపురేఖలు మార్చి వేశారు. దాదాపు 500 ట్రక్కుల చెత్తను తొలగించారు. బావి దగ్గర ఆక్రమణలు తొలగించి, చుట్టూ పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటలకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు.
చిన్నచిన్న వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా కొత్తగా టూరిస్ట్ ప్లాజా భవనం నిర్మించారు. ఇందులో ఏర్పాటు చేసిన మెట్ల బావి డీపీఆర్, బావిలో పేరుకుపోయిన పూడిక తొలగింపు సందర్భంగా దొరికిన వివిధ రకాల పురాతన పరికరాల ప్రదర్శన, గార్డెన్ ఇందులో ఏర్పాటు చేశారు. ఈ మెట్లబావి పునరుద్ధరణ పనులను మంత్రి తలసాని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
సిటీలో ఇలాంటి మెట్లబావులు చాలావరకు ఉండగా..ఇప్పటివరకూ బన్సీలాల్‌పేటతో పాటు ఆరింటి పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. వీటిలో బాపూఘాట్, గచ్చిబౌలి, సీతారాంబాగ్, గుడిమల్కాపూర్, శివంబాగ్‌లోని మెట్ల బావుల మరమ్మతులు పూర్తయ్యాయి. మరో 20కి పైగా కట్టడాల పునరుద్ధరణ త్వరలోనే పూర్తి కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com