మెట్రోకు ఎలాంటి ప్రమాదం లేదు.. వదంతులు నమ్మొద్దు : మెట్రో ఎండీ

మెట్రోకు ఎలాంటి ప్రమాదం లేదు.. వదంతులు నమ్మొద్దు : మెట్రో ఎండీ

హైదరాబాద్ లో గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో భారీ వరద నీరు వచ్చింది. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు పలు చోట్ల మెట్రో పిల్లర్ల వద్ద నీరు నిలిచింది. మూసాపేట్ మెట్రో స్టేషన్ దగ్గర రోడ్డు కుంగిపోయింది. దీంతో మెట్రో పిల్లర్లకు ప్రమాదం ఉందంటూ వదంతులు వచ్చాయి.

ఈ వదంతులపై మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి స్పందించారు. వరదలతో మెట్రో పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులు ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. మెట్రోపై వదంతులు నమ్మొద్దని కోరారు. మెట్రో నిర్మాణం అంతా సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు.

కూకట్‌పల్లి ఐడీఎల్‌ చెరువు నుంచి భారీ వరద రోడ్లపైకి చేరిందని, వరదకు మెట్రో పిల్లర్‌ చుట్టూ ఉన్న మట్టి కొట్టుకుపోయిందని తెలిపారు. మెట్రో విషయంలో వరద ప్రభావంపై ఇంజినీర్లు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. వర్షాలు తగ్గాక మరమ్మత్తులు చేస్తామని మెట్రో ఎండీ వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story