Metro Trains : ప్రయాణికులకు శుభవార్త.. రేపట్నుంచి మెట్రో సేవల సమయం పెంపు..!

X
By - TV5 Digital Team |31 May 2021 4:52 PM IST
Metro Trains : నగర ప్రయాణికులకి హైదరాబాదు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ 1వ తేదీ నుంచి మెట్రో సేవల సమయాన్ని పెంచుతున్నట్లు వెల్లడించారు.
Metro Trains : నగర ప్రయాణికులకి హైదరాబాదు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ 1వ తేదీ నుంచి మెట్రో సేవల సమయాన్ని పెంచుతున్నట్లు వెల్లడించారు. రేపట్నుంచి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. లాక్ డౌన్ సడలింపులో భాగంగా మెట్రో సేవల సమయాన్ని పొడిగించారు. చివరి రైలు ఒంటి గంటకు బయల్దేరి 2 గంటల వరకు చివరి స్టేషన్‌కు చేరుకోనుంది. అన్ని రకాల ప్రజా రవాణాకు మరో గంట అదనంగా వెసులుబాటు కల్పించారు. కాగా కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జూన్ 10 వరకు లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com