MIM: తాజ్‌మహాల్ ఎవరి కళ్లల్లో ఆనందం కోసం కట్టారు: ఒవైసీ

ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యమైనదని ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బీబీసీ ఆఫీస్‌పై ఐటీ సోదాలను ఖండించిన ఆయన బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. చైనా పేరు చెప్పాలంటే భారత ప్రధాని భయపడుతున్నారని, గుజరాత్‌లో ఏం జరిగిందో ఎవరు మర్చిపోలేదనీఅన్నారు. సంఘ్ పరివార్ అండ చూసుకొని బీజేపీ నాయకులు రెచ్చిపోతున్నారని అన్నారు.
తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సెక్రటియేట్ గుమ్మటాలను కూల్చేస్తామని అనడంపై కూడా ఒవైసీ స్పందించారు. తాజ్‌మహాల్ చాలా అందంగా ఉంటుందని దాన్ని ఎవరి కళ్లలో ఆనందం కోసం కట్టారని సెటైర్ వేశారు. ఎక్కడైనా కూల్చివేత దోరణి మంచిది కాదన్నారు ఒవైసీ. ఎమర్జెన్సీ కాలంలో బీజేపీకి అనుకూలమైన కథనాలను ప్రసారం చేసినప్పుడూ ఆ పార్టీ నాయకులు బీబీసీని పొగిడారనీ ఒవైసీ గుర్తుచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com