Raja Singh Video : రాజాసింగ్ వీడియో తొలగించాలని ఎంఐఎం డిమాండ్..

Raja Singh : బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూవులను కించపరిచే మునావర్ ఫారూఖితో హైదరాబాద్‌లో షో జరిపించారంటూ కేటీఆర్‌పై మండిపడ్డారు. థర్డ్ క్లాస్ కామెడీతో హిందువులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు రాజాసింగ్. రామభక్తులంతా ఒక్కటైతే పరిస్థితులు వేరేలా ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడ్డారు MIM నేతలు. రాజాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ సీపీ ఆఫీసు ముందు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. సోషల్ మీడియాలో రాజాసింగ్ పోస్టు చేసిన వీడియోను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని..లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సీపీ ఆఫీసు ముట్టడికి యత్నించడంతో MIM నేతలను అరెస్టు చేశారు పోలీసులు. భవానీనగర్, డబీర్‌పురా, రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్‌లలో రాజాసింగ్‌పై FIR నమోదు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలతో పాతబస్తీలో హైటెన్షన్ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com