పీవీకి భారత రత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని వ్యతిరేకించిన ఎంఐఎం

X
By - kasi |8 Sept 2020 4:36 PM IST
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలన్న తెలంగాణ అసెంబ్లీ తీర్మానాన్ని MIM పార్టీ వ్యతిరేకించింది..
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలన్న తెలంగాణ అసెంబ్లీ తీర్మానాన్ని MIM పార్టీ వ్యతిరేకించింది. సోమవారం జరిగిన BAC సమావేశంలోనూ.. ఇదే అంశంపై తన వ్యతిరేకతను తెలిపారు మజ్లిస్ నేతలు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభ్యులందరూ తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. బుధవారం నుంచి సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి.. అరగంటపాటు జీరో అవర్ వుంటుంది.. ఆ తర్వాత సీఎం కేసీఆర్ సభలో కొత్త రెవెన్యూ ముసాయిదా బిల్లును ప్రవేశపెడతారు.. ఈనెల 10, 11 తేదీల్లో కొత్త రెవెన్యూ చట్టంపై సభలో చర్చ జరగనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com