కరోనా సెకండ్ వేవ్‌ చాలా డేంజర్‌గా మారింది: మంత్రి ఈటల

కరోనా సెకండ్ వేవ్‌ చాలా డేంజర్‌గా మారింది: మంత్రి ఈటల
మహారాష్ట్ర కరోనా ప్రభావం తెలంగాణపై అధికంగా ఉందన్న ఆయన.. రోజుకు లక్షన్నర మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందున్నారు.

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉందన్నారు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. మహారాష్ట్ర కరోనా ప్రభావం తెలంగాణపై అధికంగా ఉందన్న ఆయన.. రోజుకు లక్షన్నర మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందున్నారు. రాష్ట్రంలో 60 వేల బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అటు తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 5వేల 093 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో వైరస్ ప్రవేశించిన తర్వాత ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 743 కేసులు తేలాయి. జిల్లాల్లోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story