రాష్ట్రంలో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ ఉండదు : మంత్రి ఈటల

రాష్ట్రంలో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ ఉండదు : మంత్రి ఈటల
తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌, కర్ఫ్యూకి ఆస్కారం లేదని, ఉండదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌, కర్ఫ్యూకి ఆస్కారం లేదని, ఉండదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. కరోనా విషయంలో ప్రజలు భయపడాల్సిన పనిలేదన్నారు మంత్రి ఈటల రాజేందర్‌. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. హైదరాబాద్‌లోని కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఈటల రాజేందర్‌ సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్రను ఆనుకుని వున్న జిల్లాల్లోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని ఆయన చెప్పారు. జిల్లాల్లో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.. అవసరమైతే టెస్టులను లక్షకు పెంచేందుకు సిద్ధమని చెప్పారు.. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కూడా సమర్థంగా నిర్వహిస్తున్నట్లు ఈటల రాజేందర్‌ చెప్పారు.

Tags

Next Story