ట్రాఫిక్ పోలీస్‌ని మెచ్చిన మంత్రి హరీష్ రావు

ట్రాఫిక్ కానిస్టేబుల్ తాను చేసిన పనికి మంత్రి హరీష్ రావు నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయడం మావల్ల కాదు బాబోయ్ అని అనుకున్నా డ్యూటీ చేయక తప్పదు.. అదే సమయానికి అంబులెన్స్ వస్తే.. అడ్డదిడ్డంగా ఉన్న వెహికల్స్‌ని తప్పించుకుని వెళ్లడం ఆ వాహనానికి అసాధ్యం.. కానీ నగరంలోని కోఠి సెంటర్‌కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీ సమయస్ఫూర్తితో వ్యవహరించి అంబులెన్స్ సకాలంలో ఆస్పత్రికి చేరేలా సహకరించారు.
నిత్యం రద్దీగా ఉండే మొజంజాహీ మార్కెట్ వద్ద విధులు నిర్వహిస్తున్న బాబ్జీ కోఠీ వెళ్లే మార్గంలో ఓ అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకోవడాన్ని గమనించారు.. వెంటనే పరిగెడుతూ ట్రాఫిక్‌ని క్లియర్ చేయించారు.. అంబులెన్స్ సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడానికి సహకరించారు. సమయానికి వైద్యం అందడంతో అందులోని వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి అభినందించారు.. పోలీస్ చూపిన సమయస్ఫూర్తిని ప్రశంసించారు. ఉన్నతాధికారులతో పాటు నెటిజన్ల ప్రశంసలనూ అందుకున్నారు ట్రాపిక్ కానిస్టేబుల్ బాబ్జీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com