గడియారాలు, బొట్టుబిళ్లలు ఇచ్చారని బీజేపీకి ఓటు వేస్తే ఆగం అవుతారు : హరీష్‌రావు

గడియారాలు, బొట్టుబిళ్లలు ఇచ్చారని ఎవరైనా బీజేపీకి ఓటేస్తారా అంటూ ప్రశ్నించారు మంత్రి హరీష్‌రావు. రూపాయి బొట్టుబిళ్లలు ఇచ్చి ఓట్లు అడుగుతున్న BJP కావాలో, కల్యాణలక్ష్మి కింద ఒక లక్ష నూటపదహార్లు సాయం చేస్తున్న TRS కావాలో ప్రజలకు తెలుసన్నారు. 6 సార్లు అవకాశం ఇచ్చినా ఈటల రాజేందర్ చేయని అభివృద్ధి.. ఈ రెండేళ్లకు గెల్లు శ్రీనివాస్‌కి ఓటు వేసి గెలిపిస్తే చేసి చూపిస్తామని అన్నారు. రానున్న రోజుల్లో 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. పేదలకు డబుల్‌బెడ్ ఇళ్లు సహా అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మంత్రి హరీష్‌రావు సమక్షంలో పలువురు TRSలో చేరారు. మోతుకులగూడెం మొత్తం ఏకపక్షంగా గులాబీజెండాకు మద్దతివ్వడం సంతోషంగా ఉందని హరీష్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com