గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం తప్ప బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదు : మంత్రి హరీష్‌రావు

హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు.. బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు.. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.. హుజురాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమైందన్నారు.. ప్రతిపక్షాలు సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయన్నారు. ఈటల రాజేందర్ మొసలి కన్నీరు కారుస్తుందని హరీష్‌రావు మండిపడ్డారు. అంతకు ముందు టీఆర్‌ఎస్ శ్రేణులు కమలాపూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించాయి.. ఈ ర్యాలీలో మంత్రి హరీష్ కూడా పాల్గొన్నారు.. బుల్లెట్ నడిపి పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచారు.. ఆ తర్వాత సభా వేదికపై ఓ పాటకు హరీష్‌రావు స్టెప్పులేశారు.. పార్టీ కండువాలను రజనీకాంత్ స్టైల్‌లో ఊపుతూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు, సభకు వచ్చిన ప్రజల్లో జోష్ పుట్టించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com