Harish Rao : ప్రచారానికి వెళ్తూ రోడ్డు పక్కన హోటల్‌లో దోశ తిన్న మంత్రి హరీష్ రావు...!

Harish Rao : అది హుజూరాబాద్ నియోజకవర్గంలోని మరివానిపల్లి కాకా హోటల్. ప్రతి రోజు లాగే అక్కడ టిఫిన్లు తినేవారితో సందడిగా ఉంది. అంతలో అక్కడికి దూసుకువచ్చింది ఓ కాన్వాయ్. అందులో నుంచి పొడగాటి విఐపి దిగి.. సరాసరి కాకా హోటల్లో అడుగుపెట్టారు. సాదారణజనంతో కలిసి టిఫిన్ ఆరగించారు. ఈ సీన్ చూసి ఆశ్చర్యపోవడం మరివాని పల్లి వాసుల వంతైంది.
మరివాని పల్లి వాసుల మనసు గెలుచుకున్న ఆ వ్యక్తి ఎవరో కాదు... మాస్ మహారాజా హరీష్ రావు. సాధారణ జనంలో ఇట్టే కలిసిపోయే మంత్రి హరీష్ రావు.... హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంత కుంట మండలం రాచపల్లి గ్రామంలో ప్రచారంకు వెళుతూ మార్గమధ్యంలో మరివానిపల్లిలో ఒక టిఫిన్ కొట్టు దగ్గర ఆగారు. దోశ ఆర్డర్ చేసి సాదాసీగా సామాన్యుడిలాగే హోటల్ లో కుర్చొనీ టిఫిన్ ఆరగించారు. దోశ బాగుందని వారితో ఆప్యాయంగా మాట్లాడారు. మళ్లీ వచ్చి భోజనం కూడా చేస్తానని చెప్పి వెళ్లారు.
మంత్రి హరీష్ రావును అప్పటివరకు పేపర్లలో, టీవీల్లో మాత్రమే చూసిన కాకా హోటల్ కుటుంబం... ఏకంగా తమ హోటల్‌కే రావడంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కుటుంబ సమేతంగా ఆయనతో కలిసి ఫోటో దిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com