సిద్ధిపేట కోమటి చెరువుపై గ్లో గార్డెన్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు..!

సిద్ధిపేట కోమటి చెరువుపై గ్లో గార్డెన్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు..!
కోటి అందాలతో కోమటి చెరువు ముస్తాబు అవుతుందని పాడిన పాటను, కేసీఆర్ కలలు గన్న సిద్దిపేటను ఇవాళ నిజం చేసి.. పట్టణ ప్రజలకు అందిచామన్నారు హరీష్ రావు.

సిద్ధిపేట కోమటి చెరువు పై గ్లో గార్డెన్‌ను మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోటి అందాలతో కోమటి చెరువు ముస్తాబు అవుతుందని పాడిన పాటను, కేసీఆర్ కలలు గన్న సిద్దిపేటను ఇవాళ నిజం చేసి.. పట్టణ ప్రజలకు అందిచామన్నారు హరీష్ రావు. సిద్దిపేట అభివృద్దిని చూడడానికి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారని.. ప్రజల కష్టసుఖాలు, అభివృద్దితో పాటు ఆహ్లాదంలో కూడా పాలు పంచుకుంటున్నారని తెలిపారు. 25 కోట్ల రూపాయలతో మిగతా నెక్లెస్ రోడ్‌ను త్వరలోనే పూర్తి చేస్తామని.. 50 లక్షలతో నిర్మించే వాలీబాల్ అకాడమీ సిద్ధిపేటకు మంజూరైందన్నారు. ప్రజల ఆలోచనలే ఎజెండాగా సిద్దిపేట పట్టణాన్ని తీర్చిదిద్దుతామని హరీష్ రావు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story