మరోసారి మానవత్వం చాటుకున్న మంత్రి హరీష్‌రావు

మరోసారి మానవత్వం చాటుకున్న మంత్రి హరీష్‌రావు

Harish Rao (File Photo)

మంత్రి హరీష్‌ రావు మరోసారి మానవత్వం చాటుకున్నారు.

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌ రావు మరోసారి మానవత్వం చాటుకున్నారు.తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌ రావు మరోసారి మానవత్వం చాటుకున్నారు. మెదక్‌ జిల్లా చిన్నకోడూర్‌ మండలం రామంచ గ్రామంలో ఇల్లు కూలి నిరాశ్రయులైన కుటుంబానికి అండగా నిలిచారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కుప్పకూలి.. తల్లీ, కూతురు నిరాశ్రయులయ్యారు. ఎనిమిదేళ్ల క్రితం భర్త రాజయ్య గుండెపోటుతో చనిపోవడంతో.. బాలామణి అనే మహిళ.. తన కూతురితో కలిసి మేకలు కాస్తు ఇళ్లు నెట్టుకొస్తుంది. ఉన్న ఒక్క ఇల్లు కూడా కూలిపోవడంతో.. నిలువనీడ లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన మంత్రి హరీష్‌ రావు.. పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి అండగా నిలిచారు. కుప్పకూలిన చోటే కొత్త ఇంటిని కట్టించి ఇచ్చారు. గృహప్రవేశానికి హాజరై.. తల్లీ కూతుర్లకు కొత్త బట్టలు, స్వీట్లు ఇచ్చారు.

Tags

Next Story