తెలంగాణ

Harish Rao: అన్నం పెట్టే రైతుల నోట్లో కేంద్రం సున్నం కొడుతోంది: హరీష్ రావు

Harish Rao: కార్పొరేట్లకు లక్షల కోట్లు మాఫీలు, రాయితీలు ఇచ్చే కేంద్రం..రైతులకు లక్ష కోట్ల ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు.

Harish Rao: అన్నం పెట్టే రైతుల నోట్లో కేంద్రం సున్నం కొడుతోంది: హరీష్ రావు
X

Harish Rao: వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. సిద్దిపేట ఆర్డీవో ఆఫీసు దగ్గర నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. రైతులతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నం పెట్టే వాళ్ల నోట్లో సున్నం కొట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు హరీష్ రావు.

కార్పొరేట్లకు లక్షల కోట్లు మాఫీలు, రాయితీలు ఇచ్చే కేంద్రం..రైతులకు లక్ష కోట్ల ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు, విద్యుత్ కోసం ధర్నాలుండేవన్నారు. విద్యుత్, విత్తనాల సమస్యలు పరిష్కరించామన్నారు. కేంద్రం అతి తెలివి ప్రదర్శిస్తోందన్నారు. తెలంగాణలో పండని పంటను కొంటామని చెప్తోందన్నారు.

కొత్త అగ్రి చట్టాలతో రైతులకు మద్దతు ధర హక్కుగా ఉండదన్నారు. ఢిల్లీలో రైతులు ఏడాదిగా ధర్నా చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు హరీష్ రావు. 600 మంది రైతులు చనిపోయినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. జై కిసాన్ నినాదాన్ని బీజేపీ నై కిసాన్ గా మార్చిందన్నారు.

Next Story

RELATED STORIES