సీఎం కేసీఆర్ పుట్టిన రోజున రంగనాయకసాగర్ నీరు విడుదల చేసిన మంత్రి హరీష్‌రావు

సీఎం కేసీఆర్ పుట్టిన రోజున రంగనాయకసాగర్ నీరు విడుదల చేసిన మంత్రి హరీష్‌రావు
X
చిన్నకోడూర్‌ మండలం చందలపూర్‌ గ్రామ పరిధిలోని రంగానాయక సాగర్ ద్వారా యాసంగి పంటలకు నీరు విడుదల చేశారు.

సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గంలో అన్నదాతలకు సాగునీరు అందించారు మంత్రి హరీష్‌రావు. చిన్నకోడూర్‌ మండలం చందలపూర్‌ గ్రామ పరిధిలోని రంగానాయక సాగర్ ద్వారా యాసంగి పంటలకు నీరు విడుదల చేశారు. సీఎం పుట్టిన రోజున ఈ ప్రాంత ప్రజలకు నీరు అందిచడం సంతోషంగా ఉందన్నారు హరీష్‌రావు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు తెచ్చిన కేసీఆర్‌ జన్మధన్యమైందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఈ సారి 50 లక్షల ఎకరాలు జిల్లాలో సాగులోకి వచ్చాయన్నారు. ఒకనాడు తాగడానికి గుక్కెడు నీళ్లు లేని దుస్థుతి నుంచి కేసీఆర్ ముందు చూపుతో యాసంగి పంటకు నీళ్లు ఇచ్చే పరిస్థితి చేరుకున్నామన్నారు హరీష్‌రావు.

Tags

Next Story