Harish rao : ఆచార్య జయశంకర్ అడుగుజాడల్లోనే..!

ఆచార్య జయశంకర్ అడుగుజాడల్లో... నీళ్లు, నిధులు, నియమకాలు చేపడతామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్, నారాయణఖేడ్ నియోజవర్గాల్లో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో చుక్కనీరు ఇవ్వలేదని....టీఆర్‌ఎస్ ఆధికారంలోకి వచ్చాకే ఇంటింటికి నీళ్లు అందిస్తున్నట్లు హరీష్‌రావు స్పష్టం చేసారు. ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా పూర్తిగా వెనుకబడిందన్న హరీష్‌రావు...తెలంగాణ వచ్చాకే అభివృద్ధిలో దూసుకపోతోందని వివరించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంత కర్త
— Harish Rao Thanneeru (@trsharish) June 21, 2021
బంగారు తెలంగాణకు బాటలు చూపిన మాహాత్మ..
నీ స్పూర్తిని చెదరకుండా మా గుండెల నిండా పదిలంగా ఉంచుకున్నాం.
జయహో జయశంకర్ సార్..
పిడికిలెత్తి పలుకుతోంది తెలంగాణ జోహార్!
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా అశృనివాళులు pic.twitter.com/Ea5YQBeGtE
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com