ఎంఎన్‌జే ఆస్పత్రిలో కొత్త బ్లాక్ ప్రారంభం

300 పడకల బ్లాక్‌ను ప్రారంభించుకోవడం సంతోషకరం అన్నారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు. ఎంఎన్‌జే ఆస్పత్రి కొత్త బ్లాక్‌ను ప్రారంభించారు ఆయన. తెలంగాణ వస్తే ఏం వస్తుందని కొందరు అన్నారని, తెలంగాణ వచ్చాక 37 మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నామన్నారు. ఎంబీబీఎస్ సీట్లను 7 వేలకు పెంచుకున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. 10 వేల బెడ్స్‌తో కొత్త ఆస్పత్రుల నిర్మాణం జరుగుతుందన్న హరీష్‌రావు ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తామన్నారు. వైద్య విద్యకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, తెలంగాణ వచ్చాక క్యాన్సర్‌కి సంబంధించి ఆరోగ్యశ్రీ ద్వారా 800 కోట్లు నిధులు ఖర్చు పెట్టామన్నారు. త్వరలో జిల్లాల్లో క్యాన్సర్ బాధితులకు కీమో థెరఫీ చికిత్సను ప్రారంభిస్తామని, డయాగ్నోస్టిక్ సెంటర్స్‌తో క్యాన్సర్ డిటెక్షన్ చేయనున్నామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com