బీఆర్ఎస్ నేతలంతా తెరిచిన పుస్తకాలే: మంత్రి జగదీష్ రెడ్డి

బీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల వ్యాపార సంస్థలు.. ఇళ్లలో ఒకేసారి ఐటీ అధికారులు సోదాలు చేపట్టడం కలకలం రేపుతోంది. ఓ ఎంపీ ఇంటికి కూడా వెళ్లిన అధికారులు నోటీసులు జారీ చేసి వెనుదిరిగారు. 60 బృందాలు ఈ సోదాల్లో పాల్గొనగా వారికి CRPF సిబ్బంది భద్రత కల్పించారు. నిన్న ఉదయం ఏడు గంటల నుంచే మొదలైన సోదాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. ఇవాళ కూడా కొనసాగే అవకాశం ఉంది.
ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి,... ఇళ్లు, వ్యాపార సంస్థల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన వ్యాపార సంస్థలు, బంజారాహిల్స్‌లోని ఆయన ఇంట్లోనూ సోదా చేశారు. ఆ సమయంలో జనార్దన్ రెడ్డి తల్లి అనారోగ్యానికి గురికావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు అనుమతించారు.
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి వ్యాపార కార్యాలయాలు, ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ముషీరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్త కొండపల్లి మాధవ్ ఇంట్లోనూ సోదాలు చేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆయన సన్నిహితుడు శ్రీధర్ రెడ్డి గచ్చిబౌలిలోని లుంబినీ ఎస్సెల్లార్ స్ప్రింగ్స్‌లో నివసిస్తున్నారు. ఉదయం ఏడు గంటలకే వీరి ఇళ్లకు చేరుకున్న దాదాపు 8 ఐటీ బృందాలు కొద్దిసేపు అక్కడే ఉండి తిరిగి వెళ్లాయి.
ఐటీ రైడ్స్‌పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైరయ్యారు. ఇవన్నీ బీజేపీ ప్రేరేపిత దాడులేనన్నారు. విచారణ సంస్థలను అడ్డు పెట్టుకుని బీజేపీ ప్రతిపక్షాలపై దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. బీఆర్ఎస్ నేతలంతా తెరిచిన పుస్తకాలేనన్నారు. బీజేపీ దాడులకు తాము బయపడేదిలేదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com