దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు అమలు చేయాలి : మంత్రి కొప్పుల

Koppula Eshwar : హుజురాబాద్ కేంద్రంగా దళితబంధుపై పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. బైపోల్ ముగిసినా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల మంటలు చల్లారడం లేదు. ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ..కౌంటర్, ప్రతికౌంటర్‌లతో వేడి పుట్టిస్తున్నాయి. దళితుల ఓట్ల కోసమే... కేసీఆర్ దళితబంధు పథకం తెచ్చారని బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే... దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు అమలు చేయాలని మంత్రులు సవాల్ విసురుతున్నారు...VIS
అటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ, ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హుజురాబాద్‌లో దళితుల ఓట్ల కోసమే కేసీఆర్ ప్రలోభాలు పెట్టినా... లొంగకుండా విచక్షణతో ఓటేసి.. టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పారన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పిన కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.
ఇటు బీజేపీ నాయకుల ఆరోపణలకు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. దళిత బంధును అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేయడం హస్యాస్పదంగా ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేంద్రం నుంచి దళితులకు ఏంతెస్తారో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు అమలు చేయాలని కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు.
మొత్తానికి హుజురాబాద్ కేంద్రంగా దళితబంధుపై మొదలైన పొలిటికల్ గేమ్.. ఇప్పట్లో తగ్గేలా లేదు. ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ.. 2023 అసెంబ్లీ యుద్ధానికి దళితబంధు ఎజెండాను ఫిక్స్ చేస్తున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com