Minister KTR : పేదల చదువు కోసం సొంత డబ్బులతో స్కూల్‌ కట్టిస్తున్న మంత్రి కేటీఆర్‌

Minister KTR :  పేదల చదువు కోసం సొంత డబ్బులతో స్కూల్‌ కట్టిస్తున్న మంత్రి కేటీఆర్‌
X
Minister KTR : సీఎం కేసీఆర్‌ వ్యవసాయ కుటుంబంలో పుట్టారు కాబట్టే... రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు మంత్రి కేటీఆర్‌.

Minister KTR : సీఎం కేసీఆర్‌ వ్యవసాయ కుటుంబంలో పుట్టారు కాబట్టే... రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు మంత్రి కేటీఆర్‌. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన... కోనాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 60 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేసీఆర్‌ వల్లే 24 గంటల విద్యుత్‌, రైతు బంధు, రైతు బీమా వస్తుందని అన్నారు. కొందరు ఎటుపడితే అటు ఇష్టం ఇచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 1945 వరకు కోనాపూర్‌లో తన నానమ్మ కుటుంబం ఉండేదని... కేసీఆర్‌ పుట్టినప్పటికే వందలు ఎకరాలు ఉండేవని గుర్తు చేసుకున్నారు.


Tags

Next Story