అన్ని రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ: మంత్రి కేటీఆర్‌

అన్ని రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ: మంత్రి కేటీఆర్‌
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టీఎస్‌ ఐపాస్ ద్వారా స్వీయ ధృవీకరణతో పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు

అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్‌. పర్యావరణం, పరిశ్రమల్లో తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టీఎస్‌ ఐపాస్ ద్వారా స్వీయ ధృవీకరణతో పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. నాడు పరిశ్రమలు రావు, పాలన చేతకాదన్న నోళ్లు ఇప్పుడు మూతపడ్డాయన్నారు. సినీ నటుడు రజనీకాంత్‌ సైతం హైదరాబాద్‌ అభివృద్ధిని న్యూయార్క్‌తో పోల్చారని గుర్తు చేశారు. 65 ఏళ్లలో జరగని అభివృద్ధి.. ఈ తొమ్మిదేళ్లలో జరిగిందని చెప్పారు. కేసీఆర్‌.. ఎన్నికల కోసం కాదు.. రాబోయే తరాల గురించి ఆలోచించే నాయకుడని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెం గ్రీన్‌ ఇండస్ట్రియల్ పార్కులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.I

Tags

Next Story