KTR : ముఖ్యమంత్రి అయ్యాక KCR సాఫ్ట్ అయ్యారని అనుకోవద్దు.. ఒరిజినల్ అలాగే ఉంది..!

KTR : ముఖ్యమంత్రి అయ్యాక KCR సాఫ్ట్ అయ్యారని అనుకోవద్దు..  ఒరిజినల్ అలాగే ఉంది..!
KTR : ముఖ్యమంత్రి అయ్యాక KCR సాఫ్ట్ అయ్యారని అనుకోవద్దన్నారు మంత్రి కేటీఆర్. ఒరిజినల్ అలాగే ఉందని.... రెచ్చగొట్టాలని చూస్తే ప్రతిపక్షాలకే ప్రమాదమని హెచ్చరించారు.

KTR : ముఖ్యమంత్రి అయ్యాక KCR సాఫ్ట్ అయ్యారని అనుకోవద్దన్నారు మంత్రి కేటీఆర్. ఒరిజినల్ అలాగే ఉందని.... రెచ్చగొట్టాలని చూస్తే ప్రతిపక్షాలకే ప్రమాదమని హెచ్చరించారు. కామారెడ్డిలో పర్యటిస్తున్న కేటీఆర్... బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆరే బ్రాండ్ అంబాసిడర్ అన్నారు కేటీఆర్. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీజేపీ నీళ్లు నములుతోందన్నారు. తెలంగాణ పథకాలనే కేంద్రం కాపీ కొడుతోందన్నారు. బీజేపీ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు కేటీఆర్. సోషల్ మీడియాలో కార్యకర్తలు విజృంభించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు కూడా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేం లేదని విమర్శించారు కేటీఆర్.

Tags

Read MoreRead Less
Next Story