Minister KTR : మంచిరోజులు వస్తాయన్న మోదీ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ విమర్శలు

Minister KTR :  మంచిరోజులు వస్తాయన్న మోదీ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ విమర్శలు
Minister KTR : కేంద్రం, ప్రధాని మోదీ పనితీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్​ మరోసారి విరుచుకుపడ్డారు.

Minister KTR : కేంద్రం, ప్రధాని మోదీ పనితీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్​ మరోసారి విరుచుకుపడ్డారు. మంచిరోజులు వస్తాయంటూ ఎనిమిదేళ్ల క్రితం ప్రధాని మోదీ చేసిన ట్వీట్​పై మంత్రి కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రధాని 2014 మే 16న చేసిన ట్వీట్​ను జతపరుస్తూ మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా విమర్శనాస్త్రాలు సంధించారు. ఎనిమిదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు మంచిరోజులు వస్తాయంటూ హామి ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం చేసిందేమిటో చూడండన్న కేటీఆర్.. రూపాయి మారక విలువ 77 రూపాయల 80 పైసల కనిష్ఠానికి పడిపోయిందన్నారు. నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్ఠ స్థాయికి, ద్రవ్యోల్బణం 30 ఏళ్ల అత్యధిక స్థాయికి పెరిగిందని కేటీఆర్ ట్విటర్​లో పేర్కొన్నారు. గ్యాస్ ధర ప్రపంచంలోనే అత్యధిక రేటుకు చేరిందని విమర్శించారు. 42 ఏళ్లల్లో అత్యంత దారుణమైన ఆర్థికవ్యవస్థ ఏర్పడిందని విమర్శించిన కేటీఆర్.. వెల్ డన్ సర్ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు.

Tags

Read MoreRead Less
Next Story