Minister KTR : పాలమూరు పచ్చబడుతుంటే కొంతమంది కండ్లు ఎర్రబడుతున్నాయి : మంత్రి కేటీఆర్

Minister KTR : పచ్చి అబద్ధాలతో పాలమూరు రైతాంగాన్ని మోసం చేసేందుకు బీజేపీ నేతలతో పాటు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. పాలమూరు పచ్చబడుతుంటే కొంత మంది కండ్లు ఎర్రబడుతున్నాయని, చెరువులు నిండుతుంటే కొంతమంది గుండెలు మండుతున్నాయని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు.
నారాయణపేటలో అభివృద్ధి, సంక్షేమ పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి కేటీఆర్ ప్రసంగించారు. కృష్ణా జలాల్లో నీటి వాటాను తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం చెందిందని కొందరు పనికిమాలిన మాటలు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల హక్కు ఇవ్వాలని, పంపకాలు తేల్చాలని 8 ఏండ్లుగా కోరుతూనే ఉన్నామన్నారు.
స్వయంగా మోదీని కేసీఆర్ అడిగినా ఉలుకుపలుకు లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రధానికి చిత్తశుద్ధి ఉంటే సుష్మా స్వరాజ్ ప్రకటించిన మాదిరిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com