Minister KTR : ప్రధాని మోదీ వారణాసి పర్యటనపై మంత్రి కేటీఆర్ విసుర్లు

Minister KTR : ప్రధాని మోదీ వారణాసి పర్యటనపై మంత్రి కేటీఆర్ విసుర్లు
Minister KTR : కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ట్విట్టర్‌ ద్వారా ఎండగడుతున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.

Minister KTR : కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ట్విట్టర్‌ ద్వారా ఎండగడుతున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. వీలు చిక్కినప్పుడల్లా మోడీ సర్కార్‌ను వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నారు. తన మార్క్‌ పంచ్‌లతో చురకలంటిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయమై కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర విమర్శలతో రాజకీయం వేడెక్కింది. దీంతో కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలను ట్విట్టర్‌లో టార్గెట్‌ చేస్తున్నారు మంత్రి KTR. గతంలో లేని విధంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా ప్రధాని మోడీపై డైరెక్ట్‌ అటాక్ చేస్తున్నారు.

ఇటీవల వారణాసి పర్యటన సందర్భంగా మోడీ అక్కడి కార్మికులతో ఫోటోలు దిగి..వారితో కలిసి భోజనం చేశారు. దీనిపై ట్విట్టర్‌లో వ్యంగ్యంగా స్పందించారు KTR. కరోనా టైంలో వలస కార్మికులను గాలికొదిలేశారని, ఎన్నికలొచ్చేసరికి కూలీలతో కలిసి భోజనం చేస్తున్నారంటూ విమర్శించారు. ఎన్నికలు ఉంటే ఒకలా...లేకపోతే మరోలా మోడీ వ్యవహార శైలి ఉంటుందని విమర్శించారు. ఇందుకు సంబంధించి కరోనా టైంలో వలస కార్మికుల ఫోటోలు, మోడీ వారాణాసి పర్యటన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు కేటీఆర్‌.

కంటోన్మెంట్‌ రోడ్ల విషయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సైతం ట్వీట్‌ చేశారు కేటీఆర్. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కేంద్ర సహాయ మంత్రులకు అర్థం కావడం లేదన్నారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఏరియాలో అక్రమంగా 21 రోడ్లు మూసివేశారని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ట్విట్టర్‌లో రాజ్‌నాథ్‌కు విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్‌ బోర్డు స్థానికులకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతే GHMCలో విలీనం చేయాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. ఇదే అంశంపైనా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ట్వీట్‌ చేశారు కేటీఆర్‌. మూసివేసిన రోడ్ల జాబితాను ట్విట్టర్‌లో కిషన్‌రెడ్డికి పంపించారు. లక్షలాది మంది ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వాటిని తిరిగి తెరిపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

GST కౌన్సిల్‌ ఇటీవల వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని 7 శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. ఈ మేరకు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు లేఖ కూడా రాశారు. దేశచరిత్రలో ఏనాడూ చేనేత ఉత్పత్తులపైన పన్ను లేదని..కేంద్రం జీఎస్టీ ద్వారా మొదటిసారి 5 శాతం పన్ను విధించిందని గుర్తు చేశారు. అప్పుడే చేనేత రంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని..ఇప్పుడు మరో 7 శాతం పెంచి 12 శఆతం జీఎస్టీ విధించారని ట్విట్టర్‌లో తెలిపారు కేటీఆర్. కరోనా కారణంగా రెండేళ్లుగా టెక్స్‌టైల్‌, చేనేత రంగాలు తీవ్ర సంక్షోభంతో గడ్డు పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నాయన్నారు.

మొత్తానికి టెక్నాలజీ వాడుకుంటూ కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్. వివిధ అంశాలపై కేంద్రం టార్గెట్‌గా తనదైన మార్క్‌ చూపిస్తూ విమర్శలు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story