తన వాహనానికి చలాన్ వేసిన ట్రాఫిక్ సిబ్బందిని అభినందించిన మంత్రి కేటీఆర్
By - Prasanna |4 Oct 2021 10:15 AM GMT
తన వాహనానికి చలాన్ వేసిన ట్రాఫిక్ పోలీసులను మంత్రి కేటీఆర్ అభినందించారు.
తన వాహనానికి చలాన్ వేసిన ట్రాఫిక్ పోలీసులను మంత్రి కేటీఆర్ అభినందించారు. రెండు రోజుల క్రితం రాంగ్ రూట్‌లో వెళ్లిన మంత్రి వాహనాన్ని గమనించిన ఎస్‌ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు చూసి చలాన్ విధించారు. విషయం తెలుసుకున్న కేటీఆర్.. ట్రాఫిక్ సిబ్బందిని అభినందించారు. నిబంధనలు ప్రజలకైనా, ప్రజా ప్రతినిధులకైనా ఒక్కటేనన్నారు. నిజాయితీగా.. నిబంధనల ప్రకారం పనిచేసే ఐలయ్య లాంటి అధికారులకు తామెప్పుడూ అండగా ఉంటామన్నారు. అయితే.. చలాన్ విధించిన రోజు తాను ఆ వాహనంలో లేనన్నారు కేటీఆర్. తన వాహనానికి విధించిన చలాన్ రుసుము చెల్లించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com