KTR : బట్టేబాజ్ మాటలు చెప్పి బట్టకాల్చి మీదేస్తామంటే ఊరుకోం : మంత్రి కేటీఆర్

KTR : కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. స్థానిక నాయకత్వం స్ర్కిప్ట్ రాసిస్తే చదవారని.. గాలి మోటర్‌లో రావడం.. గాలి మాటలు చెప్పడం ఆనవాయితీగా మారిందని మండిపడ్డారు. అమిత్ షా కాదు.. అబద్ధాల బాద్‌షా అంటూ ధ్వజమెత్తారు. అమిత్ షా మాటల్లో ఒక్కటంటే ఒక్క మాట కూడా నిజం లేదని.. తుక్కుగూడలోని తుక్కుమాటల్ని ప్రజలు నమ్మడం లేదన్నారు.
తెలంగాణకు మీరు ఏం చేశారో చెప్పాలని కోరామని.. 25 ప్రశ్నలతో అమిత్ షాకు లేఖ కూడా రాశానన్నారు. నిజం చెప్పండి అమిత్ షా గారూ అంటే.. నిజాం గురించి చెప్పారని దుయ్యబట్టారు. తెలంగాణకు పనికివచ్చే ఒక్క విషయమైనా అమిత్ షా చెప్పారా అని ప్రశ్నించారు. బట్టేబాజ్ మాటలు చెప్పి బట్టకాల్చి మీదేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు మంత్రి కేటీఆర్.
ఇక్కడికొచ్చి ధోకేబాజ్ మాటలు చెప్పి దగాబాజ్ చేస్తున్నారన్నారు. తెలంగాణకు ఇచ్చిన నిధులపై ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారని.. వారిదో పార్టీనా? అని విరుచుకుపడ్డారు. తెలంగాణ అప్పులపాలైందని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com