పీవీ, ఎన్టీఆర్.. తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు : మంత్రి కేటీఆర్

పీవీ, ఎన్టీఆర్.. తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు : మంత్రి కేటీఆర్
X

మాజీ ప్రధాని, దివంగత పీవీనర్సింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్ లపై మజ్లీస్ ఎమ్మెల్యే అక్బురుద్దీన్ ఓవైసీ చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఇరువురు నాయకులు తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహానీయులు అని గుర్తు చేశారు. ఒకరు ప్రధాన అయితే.. మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారని కేటీఆర్ కొనియాడారు. ఇంటువంటి మహానీయులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయ మన్నారు. ప్రజాస్వామ్యంలో ఇంటువంటి వ్యాఖ్యలకు చోటులేదని ఆయన అన్నారు.

Tags

Next Story