సింహం సింగిల్‌గానే వెళ్తుంది : మంత్రి కేటీఆర్

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బుధవారం.... రామాంతపూర్, ఉప్పల్, ECIL, మల్లాపూర్,చిలుకానగర్‌లో రోడ్‌షో నిర్వహించిన కేటీఆర్ బీజేపీ,కాంగ్రెస్‌లపై నిప్పులు చెరిగారు. ప్రశాంత హైదరాబాద్‌లో మత చిచ్చు పెడుతున్నారంటూ మండిపడ్డారు. వరదలు వచ్చినప్పుడు స్పందించని కేంద్ర మంత్రులు... ఎన్నికలనే సరికి వెల్లువలా తరలి వస్తున్నారంటూ విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు 12 మంది కేంద్రమంత్రులు, ఓ ముఖ్యమంత్రి వస్తున్నారన్నారు. సింహం మాత్రం సింగిల్‌గానే వెళ్తుందని సీఎం కేసీఆర్ నుద్దేశించి వ్యాఖ్యానించారు..
ఆరేళ్లలో టీఆర్‌స్ పాలనలో.. నీటి సమస్యను పరిష్కరించామన్నారు మంత్రి కేటీఆర్. కేశవాపూర్‌లో రిజర్వాయర్ నిర్మాణం జరుగుతోందన్నారు. పేదలు 20 వేల లీటర్ల వరకు శాశ్వితంగా మంచి నీటి బిల్లు కట్టే అవసరం లేకుండా చేశామన్నారు. డబుల్‌బెడ్ రూం ఇళ్లు మాత్రమే బాకీ ఉన్నామని అవి కూడా తామే ఇస్తామన్నారు..
హైదరాబాద్‌కు వరదలు వచ్చినప్పుడు స్పందించని కేంద్ర మంత్రులు... ఎన్నికలనే సరికి వెల్లువలా తరలి వస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ECIL లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. మంత్రులు ఉత్తచేతులతో రాకుండా.. కేసీఆర్ అడిగిన 1350 కోట్ల రూపాయలు తీసుకొస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు ఓట్ల కోసం అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని... ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చు పెడుతున్నారని.. కేటీఆర్ మండిపడ్డారు....
పార్కులు తెస్తామని తాము చెబుతుంటే బీజేపీ వాళ్లు మాత్రం పంచాయతీలు తీసుకువస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కమలదళానికి తెలిసింది ఒకటే విద్య అని.. హిందూ- ముస్లిం..భారత్ పాకిస్థాన్ అని ఎద్దేవా చేశారు. ప్రజల మధ్య చిచ్తులు పెట్టి నాలుగు ఓట్లు సంపాదించుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. చెవులో పవ్వు పెట్టడం మొడి చేయి చూపడం తప్ప బీజేపీకి ఏమీ తెలియదని విమర్శించారు మంత్రి కేటీఆర్...
ఎన్నికల ప్రచార గడువు దగ్గర పడుతుండటంతో మంత్రి కేటీఆర్ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నాయి గులాబీశ్రేణులు. భారీగా జనసమీకరణతో పాటు ఇతర ఏర్పాట్లు చేశారు గులాబీనేతలు. దాదాపు అన్ని డివిజన్‌లను కవర్ చేస్తూ.. రోడ్‌షోలు, ప్రచారం నిర్వహిస్తూ.. కారును హై స్పీడ్‌లో నడిపిస్తున్నారు మంత్రి కేటీఆర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com