జీహెచ్ఎంసీ ప్రజలకు మంత్రి కేటీఆర్ గుడ్‌న్యూస్..!

జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే ప్రజలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీవరేజ్ ప్లాంట్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేటీఆర్ పేర్కొన్నారు. సీవరేజ్ ప్లాంట్ల నిర్మాణానికి 3 వేల 866 కోట్లను కేబినెట్ కేటాయించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన జీవోను గురువారం ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలంటే మౌలిక వసతులు ఉండాలన్నారు మంత్రి కేటీఆర్. దానికి అనుగుణంగా ఏడు సంవత్సరాలుగా జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహానగరంలో తాగునీటికి సమస్య లేకుండా చేశామని స్పష్టం చేశారు. తాగునీటి సమస్య 90 శాతం పూర్తయిందని తెలిపారు. ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా సమస్యల్లేవన్నారు. పరిశ్రమలతో పాటు అన్ని వర్గాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. హైదరాబాద్ వాటర్ ప్లస్ సిటీగా పేరొందిందని కేటీఆర్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com