ఒకరు బ్రెయిన్ లేని బంటి.. ఇంకొకరు పార్టీలు మారే చంటి : మంత్రి కేటీఆర్

కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోయే నాయకుడు ప్రతిపక్షాల్లో లేరని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒకరు మెదడు లేని బంటి.. ఇంకొకరు పార్టీలు మారే చంటి అని ఎద్దేవా చేశారు. వాళ్లా ప్రతిపక్షమని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలోని ప్రతి గ్రామం ఆదర్శంగా మారిందని చెప్పారు. దేశ జనాభాలో మూడు శాతం ఉన్న తెలంగాణకు 30 శాతం జాతీయ అవార్డులు వచ్చాయని వెల్లడించారు. ఇదంతా సీఎం కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతితోనే సాధ్యమైందన్నారు. మంగళవారం సిరిసిల్లలో జరిగిన బీఆర్‌ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలో కేటీఆర్ పాల్గొన్నారు. 60 లక్షల మంది గులాబీ దండుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. 22 ఏళ్ల క్రితం హైదరాబాద్ జలదృశ్యంలో టీఆర్‌ఎస్‌గా పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిందన్నారు. మారింది టీఆర్‌ఎస్ పేరు మాత్రమేనని.. జెండా, గుర్తు, డీఎన్‌ఏ మారలేదన్నారు కేటీఆర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com