Balanagar flyover : బాలానగర్‌ ఫ్లైఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్..!

Balanagar flyover : బాలానగర్‌ ఫ్లైఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్..!
Balanagar flyover : హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు మరిన్ని ఫ్లైఓవర్లు, స్కైవేల నిర్మాణం చేపడుతున్నట్టు మంత్రి KTR చెప్పారు.

Balanagar flyover : హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు మరిన్ని ఫ్లైఓవర్లు, స్కైవేల నిర్మాణం చేపడుతున్నట్టు మంత్రి KTR చెప్పారు. బాలానగర్‌లో నిర్మించిన ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన ఆయన.. రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఫతేనగర్ బ్రిడ్జి నిర్మాణం కూడా వేగంగా జరుగుతోందని చెప్పారు. ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకూ స్కైవేలను చేపడతామని, కేంద్రం సహకరించకపోయినా సుచిత్ర దగ్గర స్కై వే పూర్తి చేస్తామని అన్నారు.

SRDPలో భాగంగా నిర్మించిన బాలానగర్ ఫ్లైఓవర్ పనులకు 2017 ఆగస్టు 21న కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. 385 కోట్ల రూపాయలతో మూడున్నరేళ్ల వ్యవధిలో దీన్ని పూర్తి చేశారు. ఈ బ్రిడ్జి పొడవు 1.13 కిలోమీటర్లు. 24 మీటర్లు వెడల్పు, 26 పిల్లర్లతో దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జికి ఒక ప్రత్యేకత ఉంది. ఆరు లేన్లతో సిటీలోనే నిర్మించిన మొట్టమొదటి బ్రిడ్జి ఇది. 2050 సంవత్సరం వరకు ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేశారు. దీనికి బాబూ జగ్జీవన్‌రామ్‌ బ్రిడ్జిగా నామకరణం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story